మధ్యప్రదేశ్లోని భోపాల్లో టమాటా వైరస్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఆరు నెలల నుండి 12 ఏళ్లలోపు చిన్నారులు దీని బారిన పడుతున్నారు. శరీరంపై ఎర్రటి దద్దుర్లు, బొబ్బలు, జ్వరం, గొంతు నొప్పి దీని ప్రధాన లక్షణాలు. దగ్గు, తుమ్ముల ద్వారా, అలాగే శరీర స్రావాల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ప్రభావిత చిన్నారులు ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్నారు.