రంగారెడ్డిగూడ శివారులో ఒక నిర్జన ప్రాంతంలో రెండున్నరేళ్ల చిన్నారి రాత్రంతా తన తల్లి శోభ మృతదేహం పక్కనే గడిపింది. తలపై బండరాయితో మోది హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ హత్య వెనుక ప్రియుడు నర్సింహులు హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.