Tippateega Benefits: కరోనా తర్వాత తిప్పతీగ ప్రాధాన్యత పెరిగింది. ఇది అద్భుతమైన రోగ నిరోధక శక్తిని పెంచి, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు ఐరన్, జింక్ వంటి ఖనిజాలను అందిస్తుంది. జ్వరం, మధుమేహం, కీళ్ల నొప్పులు, అజీర్ణం వంటి సమస్యలను నివారించడంలో తిప్పతీగ ఎంతో సహాయపడుతుంది. ఇది ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ ఆరోగ్య వరం.