నంద్యాల జిల్లా అవుకు మండలం సుంకేసులలో మూడేళ్ళ బాలుడు మహేందర్ ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదంలో మృతి చెందాడు. అతను తన అక్క స్కూల్ బస్సు ఎక్కేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ బాలుడిని గమనించకుండా బస్సు కదిలించడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు విచారణ చేపట్టారు.