నెల్లూరు జిల్లా మనుబోలులోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. శివలింగం చుట్టూ మూడు నాగుపాములు ప్రదక్షిణలు చేసి, పడగవిప్పి కాసేపు అక్కడే ఉండటం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. సోమవారం జరిగిన ఈ సంఘటనను శివయ్య మహిమగా భావిస్తూ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఇది దైవలీల అని పలువురు అభిప్రాయపడుతున్నారు.