సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్ జల్ పల్లిలోని ఆయన ఇంట్లో ఎన్నో ఏళ్లుగా గణేశ్ అనే వ్యక్తి నమ్మకంగా పని చేస్తున్నాడు. మోహన్ బాబు ఇంట్లో నమ్మకంగా ఉంటూనే చోరీ చేసేందుకు గణేశ్ భారీ స్కెచ్ వేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రూ. 10 లక్షలు తీసుకుని ఉడాయించాడు.