అరటిపండు తక్షణ శక్తినిస్తుంది, అందుకే చాలామంది ఉదయం ఖాళీ కడుపుతో తింటారు. అయితే, ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఇలా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగి, తగ్గి అలసట, తిరిగి ఆకలి కలుగుతాయి. మెగ్నీషియం, కాల్షియం సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని, అరటిపండును ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం ఉత్తమమని వారు సూచిస్తున్నారు.