Karthika Masam 2025: కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో ఉసిరి చెట్టు (దాత్రి వృక్షం) కింద భోజనం చేయడం శ్రేష్ఠమని భావిస్తారు. ఉసిరి చెట్టు శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి స్వరూపంగా కొలవబడుతుంది. దీని మూలాల్లో విష్ణువు, కాండంలో శివుడు, పైన బ్రహ్మదేవుడు కొలువై ఉంటారని విశ్వాసం. ఉసిరి గాలి ఆరోగ్యానికి మంచిదని కూడా అంటారు.