క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తహీనత, కంటి చూపు మెరుగుదలకు ఇది సహాయపడుతుంది. తేనె కలిపి తీసుకుంటే మరింత ప్రయోజనకరం. నోటి అల్సర్లు, ముడతలను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుందని చెబుతున్నారు. నిద్రలేమి, జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట వంటి వాటికి కూడా క్యారెట్ జ్యూస్ ఉపయోగకరంగా ఉంటుంది.