నీరు శరీరానికి ఎంత అవసరమో అందరికీ తెలుసు. ఆహారం లేకపోయినా కొన్ని రోజులు బ్రతకవచ్చు. కానీ నీరు లేకపోతే ఒక్కరోజు కూడా బ్రతకలేరు. మనిషి మనుగడకు నీరు తప్పనిసరి. అయితే దాదాపు అందరూ నిలబడి నీరు తాగుతారు. కానీ ఇది సరైన పద్ధతి కాదని నిపుణులు చెప్పే మాట. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు.