రోజుకు రెండుసార్లు, రెండు నుంచి నాలుగు నిమిషాల పాటు నాణ్యమైన టూత్‌పేస్ట్‌తో పళ్ళు తోమడం చాలా ముఖ్యం. ఎక్కువసేపు లేదా గట్టిగా తోమడం వల్ల పళ్ళకు హాని కలుగుతుంది. పళ్ళ ముందు భాగంతో పాటు లోపలి భాగాన్ని కూడా శుభ్రం చేయాలి. నోటి దుర్వాసన నివారణకు నాలుకను కూడా శుభ్రం చేసుకోవడం అవసరం.