ప్రతిరోజూ 10 వేల అడుగులు నడవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గి, గుండె జబ్బులు, ఊబకాయం, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. కండరాలు దృఢపడి, ఎముకలు బలపడతాయి. నిద్ర నాణ్యత పెరిగి, రోజంతా శక్తివంతంగా ఉంటారు.