91 ఏళ్ల వయసులోనూ రోజుకు 12 గంటల పాటు పనిచేస్తున్న ఓ వృద్ధుడి కథ నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది. సింగపూర్లో పనిచేస్తున్న ఈ వృద్ధుడిని చూసి ఆస్ట్రేలియన్ ట్రావెలర్ ఆశ్చర్యపోయి ఆన్లైన్లో పంచుకోగా, ఈ వార్త మాధవన్ దృష్టికి చేరింది. సమయానికి భోజనం, నిద్ర.. ఇదే తన ఆరోగ్య రహస్యమని వృద్ధుడు చెప్పాడు. వృద్ధులను గౌరవించాలని ఆయన సందేశం.