కాలీఫ్లవర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పుష్కలంగా విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్లు ఉంటాయి. విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని విటమిన్ కె ఎముకలు, దంతాలను బలంగా ఉంచుతుంది. ఫోలేట్ శరీర కణాల నిర్మాణానికి సహాయపడుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్‌ను నివారించడంలో కూడా కాలీఫ్లవర్ సహాయపడుతుంది.