ఇంట్లో నిలువ ఉంచిన బంగాళదుంపలు మొలకెత్తడం సర్వసాధారణం. కానీ, మొలకెత్తిన బంగాళదుంపలు తినడం ఆరోగ్యానికి హానికరం. ఆరోగ్య నిపుణుల ప్రకారం, వీటి వల్ల కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు వంటి జీర్ణ సమస్యలు, తలనొప్పి, మైకం వంటి నాడీ వ్యవస్థ సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి, మొలకెత్తిన లేదా ఆకుపచ్చగా మారిన బంగాళదుంపలను తినకూడదు.