సపోటా పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ A, C, ఫైబర్, కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎముకలను బలపరుస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. క్రీడాకారులు, జిమ్ చేసేవారికి శక్తినిచ్చే మంచి పండు ఇది.