పాలను ఉపయోగించి తయారు చేసే పన్నీర్ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో అధిక ప్రోటీన్లు, శరీరానికి అవసరమైన తొమ్మిది అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ముఖ్యంగా శాఖాహారులకు, క్రీడాకారులకు పన్నీర్ ప్రోటీన్ అవసరాలను తీరుస్తుంది. పోషకాహార నిపుణులు పన్నీర్ ను తరచూ ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.