బాదంపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే వీటిని ఉదయాన్నే తినాలని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో నానబెట్టిన బాదం గింజలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదట. ఉదయం టైంలో నోటిలో ఆరోగ్యకరమైన బాక్టీరియా ఉంటుందని అది బాదంపప్పులను జీర్ణం చేయడంలో వాటి నుంచి పూర్తి ప్రయోజనాలను పొందేలా చేస్తుందని వారు చెబుతున్నారు.