వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్నను తినడం చాలా మందికి ఇష్టం. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పోషకాహార నిపుణుల ప్రకారం, మొక్కజొన్నలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కిడ్నీలో రాళ్ళు ఉన్నవారికి కూడా మొక్కజొన్న మేలు చేస్తుంది.