మొక్కజొన్న పొత్తులు కాల్చి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి రుచికరమైనవి మాత్రమే కాదు.. నీటిలో కరుగని పీచు, విటమిన్లు, ప్రోటీన్లు, మాంగనీస్, జింక్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో కూడా ఇవి సహాయపడతాయి. అయితే, గ్యాస్ స్టవ్ మీద కాల్చడం ఆరోగ్యానికి హానికరం.