పచ్చి ఉల్లిపాయలు(Raw Onions) తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఉల్లిపాయల్లో క్వెర్శెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్, ప్రోబయోటిక్స్, విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఉల్లిపాయలు సహాయపడతాయి.