ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పొటాషియం, కాల్షియం, ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తపోటును అదుపులో ఉంచుతుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, రక్తహీనతను తగ్గిస్తుంది. నీటిలో నానబెట్టి తినడం వల్ల మరింత ప్రయోజనం చేకూరుతుంది.