చికెన్ లివర్ లో ఐరన్, విటమిన్ A పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తహీనతను తగ్గించి, కంటి చూపును మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా, మానసిక ఒత్తిడి, నీరసం,నరాల సమస్యలను తగ్గించడంలో కూడా చికెన్ లివర్ సహాయపడుతుంది. మహిళలు, గర్భిణీలు, పిల్లలు, పెద్దవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.