ఉదయం నిద్ర లేవగానే నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. డీహైడ్రేషన్ నుండి బయటపడటానికి, జీవక్రియలను మెరుగుపరచడానికి, గుండె మంటను నివారించడానికి, బరువు తగ్గడానికి, కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా, మెదడు చురుకుగా పనిచేయడానికి మరియు చర్మం ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది.