వేసవి కాలంలో కొబ్బరి నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు, ఖనిజాలు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. రక్తపోటును తగ్గించడంలో, బరువు తగ్గించడంలోనూ కొబ్బరినీరు సహాయపడుతుంది. నిమ్మరసం లేదా సబ్జా గింజలతో కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.