కొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు. ఇందులో ఫైబర్, మాంగనీస్, ఇనుము వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే, కొబ్బరిని అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రోజుకు ఒకటిన్నర అంగుళం కొబ్బరి తింటే సరిపోతుంది. కొబ్బరిని నానబెట్టి తింటే మరింత ప్రయోజనకరం.