అరటిపండ్లు చాలా మందికి ఇష్టమైన పండు. కానీ, అధికంగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అరటిపండ్లలో పొటాషియం, కేలరీలు, చక్కెర ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా తిన్నట్లయితే బరువు పెరగడం, గుండె, కిడ్నీ సమస్యలు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.