వర్షాకాలం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. చాలామంది డెంగ్యూ లక్షణాలను గుర్తించలేక పోతున్నారు. ప్లేట్లెట్లు తగ్గడం వల్ల ప్రమాదం ఉంటుంది. మేకపాలు తాగితే ప్లేట్లెట్లు పెరుగుతాయని అనుకుంటున్నారు కానీ, దీని వల్ల బ్రూసెల్లోసిస్ వంటి బ్యాక్టీరియా సోకే ప్రమాదం ఉంది. వైద్యులు మేకపాలు తాగకూడదని హెచ్చరిస్తున్నారు.