కాటుక కంటి అందానికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిదని పెద్దలు చెబుతారు. ఇది కంటి ఎర్రదనాన్ని తగ్గించి, సూర్యకిరణాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో కాటుక కళ్ళకు చల్లదనాన్ని ఇస్తుందని, దుమ్ము, ధూళి నుండి రక్షిస్తుందని చెప్పబడింది. ప్రజెంటేషన్లు ఇచ్చేవారికి కూడా కాటుక ఉపయోగకరంగా ఉంటుంది.