ఉదయాన్నే కరివేపాకు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ తగ్గించడం, జీర్ణశక్తిని మెరుగుపరచడం, ఎముకలను బలపరచడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కరివేపాకు సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.