ప్రతిరోజూ ఉసిరికాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉసిరిలోని ఔషధ గుణాలు శరీరంలోని అనేక రోగాలను నయం చేయడంలో సహాయపడతాయి. పైత్యం, కఫం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి కూడా ఉసిరి ఉపయోగపడుతుంది. ఉసిరి చెట్టు వాసన పీల్చడం కూడా శ్వాస సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.