కోలీవుడ్‌లో నెంబర్ వన్ స్టార్ హీరోగా వెలుగొందుతున్న విజయ్ దళపతి.. చాలా గ్రాండ్‌గా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన టీవీకే పార్టీతో తమిళనాడులో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాడు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే... విజయ్ దళపతి చివరి సినిమా జననాయగన్‌కు రిలీజ్ కష్టాలు చుట్టుముట్టాయి. దానికితోడు ఎలక్షన్స్ ముందు దళపతి సినిమా రిలీజ్ అవ్వకుండా కొన్ని శక్తులు అడ్డుకున్నాయనే టాక్ ఉంది.