టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీని లక్ష్యంగా చేసుకుని ఎలక్ట్రిక్ ఆటో సేవలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇంటి నుంచి బస్టాప్ వరకు, బస్టాప్ నుంచి గమ్యస్థానం వరకు ఒకే టికెట్‌తో ప్రయాణించేలా ఏర్పాట్లు చేయనుంది. ప్రస్తుతం ఆటో కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయి.