ఇల్లు ఖాళీ చేసిన తర్వాత ఓనర్ అడ్వాన్స్ తిరిగి ఇవ్వకపోతే అద్దెదారులు ఆందోళన చెందనవసరం లేదు. రెంట్ అగ్రిమెంట్, పేమెంట్ ప్రూఫ్‌లు సేకరించండి. ఓనర్‌కు రాతపూర్వక అభ్యర్థన పంపండి. అవసరమైతే మోడల్ టెనెన్సీ యాక్ట్ ప్రకారం రెంట్ అథారిటీని సంప్రదించి, చట్టపరమైన నోటీసులు జారీ చేయవచ్చు. ఇంటిని ఖాళీ చేసే ముందు ఫోటోలు, వీడియోలు తీసుకోవడం ముఖ్యం.