అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్థానిక ముసలమ్మ తల్లి దేవాలయంలో జరిగిన చోరీ ఘటనలో దొంగలు నెల రోజుల తర్వాత 1.86 లక్షల రూపాయలు తిరిగి ఆలయం దగ్గర పెట్టి వెళ్లిపోయారు. హుండీలోని డబ్బును దొంగిలించిన తరువాత, వారి పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారని, తమ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. దొంగలు తమ తప్పును ఒప్పుకుని, మిగిలిన డబ్బును దేవాలయంలో వదిలేశారు.