తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని ఒక ఆలయంలో దొంగ హుండీలో చేయి పెట్టి దొరికిపోయాడు. అతని చేయి హుండీలో ఇరుక్కుపోగా, తెల్లవారే వరకు అలానే ఉండిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది అతని చేతిని బయటకు తీశారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.