ఎన్నో మలుపుల తర్వాత సినీ కార్మికుల సమ్మె చిరంజీవి ఇంటి వద్దకు వచ్చి ఆగింది. ఇరు వర్గాల వాదనలు జాగ్రత్తగా విన్నారు మెగాస్టార్. మొన్నే నిర్మాతలంతా మెగాస్టార్‌తో భేటీ అయ్యారు. మరోవైపు ఫెడరేషన్ నాయకులు వచ్చి మెగా మీటింగ్ పెట్టారు. 2 గంటలకు పైగానే సాగిన ఈ భేటీలో చాలా విషయాలు చర్చకు వచ్చాయన్నారు ఫెడరేషన్ నాయకులు.