వరంగల్ జిల్లా ఇల్లంద గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. 5400 మంది ఓటర్లు ఉండగా, 20,000కు పైగా కోతులు గ్రామంలో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించిన వారికే సర్పంచ్, ఎంపీటీసీ పదవులు అంటూ గ్రామస్తులు ప్రకటించారు. నిత్యం నరకం అనుభవిస్తున్న ప్రజలు ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు.