జనగామకు చెందిన చందులాల అనే యువకుడు హనుమకొండలో అద్దెకు ఉంటూ, డెలివరీ పని చేస్తూ, స్ప్లెండర్, ఫ్యాషన్ ప్లస్ బైకులను మాత్రమే దొంగతనం చేశాడు. 12 బైకుల దొంగతనం తర్వాత హసన్ పర్తి పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. వరంగల్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అతనిపై కేసులు నమోదయ్యాయి.