తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) బస్సుల్లో త్వరలోనే ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రానున్నారు. ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేటు సంస్థ ఇందుకు సంబంధించి ఆర్టీసీకి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతిపాదనలపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించి, త్వరలోనే అమలుకు కార్యాచరణ రూపొందించనున్నారు.