తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన ఇంటర్వ్యూలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కని కారణాల గురించి వివరించారు. కేబినెట్లో కొంతమందిని అకామడేట్ చేయలేకపోవడం వల్ల రాజగోపాల్ రెడ్డి మంత్రిత్వ శాఖను కోల్పోయారని, పార్టీ నిర్ణయాలకు ఆయన కట్టుబడి ఉంటారని తెలిపారు. ఈ విషయంలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ, అది పెద్ద విషయం కాదని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు.