తొర్రూరు మున్సిపల్ ఆఫీసుకు ఒక కాంట్రాక్టర్ తాళం వేశాడు. నాలుగు సంవత్సరాల క్రితం నుండి పూల డెకరేషన్లకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో ఆయన ఈ చర్యకు దిగాడు. బతుకమ్మ పండుగ, రాష్ట్ర అవతరణ దినోత్సవం వంటి అనేక సందర్భాలలో పూల అలంకరణలు చేసినప్పటికీ, అధికారులు బిల్లులు చెల్లించలేదు. దీంతో ఆవేదన చెందిన కాంట్రాక్టర్ ఆఫీసుకు తాళం వేశాడు.