మావోయిస్టుల హెచ్చరిక లేఖపై స్పందించిన తెలంగాణ మంత్రి సీతక్క.. తన మూలాలను తాను ఎప్పుడూ మరిచిపోలేదన్నారు. ఆదివాసీల హక్కులకు భంగం కలిగించే జీవో 49ను తాను వ్యతిరేకించినట్లు గుర్తుచేసిన ఆమె.. మంత్రిగా దీనిపై పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించినట్లు గుర్తుచేశారు. ఆదివాసీల జోలికి వెళ్లొద్దని అటవీశాఖ అధికారులకు మంత్రి కొండా సురేఖతో పాటు తాను ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.