తెలంగాణ మంత్రి కొండా సురేఖ కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేశారు. శ్రీహరిని నల్లకుట్ల మనిషి అంటూ ఆరోపించారు. తాను మంత్రి పదవిని కోల్పోతున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో ఇద్దరి మధ్య కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు నెలకొన్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.