తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఇకపై కొత్త రూల్ అమల్లోకి రానుంది. దరఖాస్తుదారులు 2.5 గంటల నిడివిగల రోడ్డు భద్రత వీడియోను చూడటంతో పాటు 20 మార్కుల పరీక్షలో 15 మార్కులు సాధించాలి. ఫేస్ రికగ్నిషన్ ద్వారా వీడియో చూసేలా నిబంధన ఉంది. ప్రస్తుతం యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లో ఈ నిబంధన అమలులో ఉంది.