Telangana Weather Update: తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు చలికి వణుకుతున్నారు. వాతావరణ శాఖ 10 జిల్లాలకు ఆరెంజ్, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. రాబోయే రెండు, మూడు రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హెచ్చరించింది.