భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గవర్నమెంట్ హైస్కూల్ టీచర్లు తమ పాఠశాలలో విద్యార్థుల అడ్మీషన్లు పెంచేందుకు ఒక ఆటోను ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుండి విద్యార్థులు బడికి రావడానికి ఇది సహాయపడుతుంది. ఈ చొరవ వల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడటానికి ఈ విధానం సహకరిస్తుందని టీచర్లు అభిప్రాయపడ్డారు.