తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో బస్సు ఛార్జీలను పెంచింది. మొదటి మూడు స్టేజీలకు ₹5, నాలుగో స్టేజీ నుంచి ₹10 అదనంగా వసూలు చేస్తారు. ఈ కొత్త ఛార్జీలు ఈ నెల ఆరో తేదీ, సోమవారం నుంచి మెట్రో డీలక్స్, ఈ-మెట్రో, ఏసీ బస్సులతో సహా అమల్లోకి వస్తాయి. ఇది లక్షలాది మంది ప్రయాణికులపై ప్రభావం చూపుతుంది.