తెలంగాణ ఆబ్కారీ శాఖ మరోసారి మద్యం ధరలను పెంచింది. క్వార్టర్‌పై రూ.10, హాఫ్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 పెంపు చేసింది. ఈ లిక్కర్ ధరల పెంపు వల్ల మద్యం వినియోగదారులపై భారం పెరిగింది. ప్రభుత్వం ఈ ఆదాయాన్ని ప్రజా సంక్షేమ పథకాలకు వినియోగిస్తుందని తెలిపింది.