తెలంగాణలోని ఫ్రీ బస్సు పథకంపై మహిళా ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బస్సులు ఆపకపోవడం, రద్దీ, డ్రైవర్ల తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలోని మన్ననూరు స్టేజ్ వద్ద శ్రీశైలం బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తున్న మహిళలు, సీఎం రేవంత్ రెడ్డికి ఈ పథకాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.